హిందీలో రీమేక్ కాబోతున్న 'గీత గోవిందం'..

SMTV Desk 2019-01-17 16:37:53  Vijay Devarakonda, Rashmika, Geetha Govindam, hindi remake, ishan katter, janvi kapoor

హైదరాబాద్, జనవరి 17: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ... రష్మిక జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి, ఆయనను స్టార్ హీరోగా మార్చేసింది. అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను ఇషాన్ కట్టర్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఇషాన్ కట్టర్ చేసిన ధడక్ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇషాన్ చేసే సినిమా ఇదే కానుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.