రాహుల్, పాండ్యాకు మరొక ఛాన్స్..???

SMTV Desk 2019-01-17 16:36:18  Sourav ganguly, Hardik pandya, KL Rahul, Coffee with karan zohar

న్యూ ఢిల్లీ, జనవరి 17: హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ వివాదంపై భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించారు.

‘నిజమే..! పాండ్యా​, రాహుల్‌ మాటలు అభ్యతంరకరమైనవే. వారు మాట్లాడింది తప్పే. కానీ, మనమంతా మనుషులం. మెషీన్లం కాదు. మెషీన్‌ మాదిరిగా మనం ముందుగానే ఫిక్స్‌ చేసినట్టుగా అన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలని లేదు. తీవ్ర విమర్శలతో వారిని మరింత బాధించొద్దు. చేసిన తప్పును తెలుసుకుని వారు కుమిలిపోతున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయరు. వారికొక అవకాశమిద్దాం. వారిపై విమర్శలతో ఇంకా రాద్ధాంతం చేయొద్దు. మనం బతుకుదాం. ఇతరులకు బతకనిద్దాం

అని వ్యాఖ్యానించారు. మరి పాండ్యా, రాహుల్ విషయంలో గూంగూలీ ఇచ్చిన సలహాను బీసీసీఐ పాటిస్తుందో లేదా.. వారిపై నిషేధం మరికొంతకాలం పొడిగిస్తుందో వేచి చూడాల్సి ఉంది.