49 భారత విశ్వవిద్యాలయాలు టాప్‌ 200లో..

SMTV Desk 2019-01-17 15:49:21  Times Higher Education rankings, rankings, India, Indian Institute of Science, IIT Bombay, IIT rurki, IIT - indoor

లండన్‌, జనవరి 17: 2019 సంవత్సరానికి గాను టీహెచ్‌ఈ(టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. మొత్తం 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారతదేశంకి చెందిన 49 వర్సిటీలు టాప్‌ 200 స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్‌) 61వ స్థానం, జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ 64వ స్థానంలో నిలిచాయి.

కాగా, సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్‌ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పూణే, ఐఐటీ(హైదరాబాద్‌) తొలిసారిగా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్‌ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. చైనాకి చెందిన నాలుగు విశ్వవిద్యాలయాలు మొదటి ఐదు స్థానాల్లో నిలవగా, మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్‌ఈ ఎడిటర్‌ ఎల్లీ బోత్‌వెల్‌ తెలిపారు.