సీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వకపోయినా...ఇచ్చే వరకు వెయిట్ చేస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే

SMTV Desk 2019-01-17 13:22:01  MLA Jaggareddy, KCR, Congress party

హైదరాబాద్, జనవరి 17: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తనతో ఎం పని లేదని, కాని తనకు కేసేఆర్ తో చాలా అవసరం ఉందని అన్నారు. అంతేకాక తమ నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ ను తప్పకుండా కలుస్తా అని వొకవేళ అప్పాయింట్మెంట్ దొరకోకపోయిన అప్పాయింట్మెంట్ ఇచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తా అని చెప్పారు.

కేసీఆర్ వొకవేళ తమ నియోజకవర్గానికి వస్తే ఆయనకు సన్మానం చేసానని చెప్పారు. ముఖ్యమంత్రి పై ఇక నుండి ఎలాంటి వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయకూడదని ప్రజలే అతన్ని ముఖ్యమంత్రి గ స్వీకరించినప్పుడు మనం కూడా స్వీకరించే భాద్యత ఉందని ఇప్పుడు ఆయనపై ఎటువంటి వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.