ప్రభాస్, వైఎస్ షర్మిలఫై అసభ్యకరంగా వార్తలు రాసిన వెబ్ సైట్లపై కఠిన చర్యలు

SMTV Desk 2019-01-17 13:10:41  YS Sharmila, Prabhash, Websites, You tube, Facebook, Anjamikumar, Cyber crimes

హైదరాబాద్, జనవరి 17: కొద్ది రోజుల క్రితం తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, అంతేకాక తనకు ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ కు ముడిపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ నగర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల. అంతేకాక గూగుల్, యూ ట్యూబ్ వెబ్ సైట్ లకు కూడా లేఖ రాశారు.

అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన అంజనీ కుమార్ సైబర్ క్రైం పోలీసులతో రంగంలోకి దిగారు. కాగా ఇలా దుష్ప్రచారం చేస్తున్న వెబ్ సైట్ లలో ప్రధానంగా యూ ట్యూబ్, పేస్ బుక్ మొత్తం 10 వెబ్ సైట్లను గుర్తించారు. ఈ కేసుపై అంజని కుమార్ మాట్లాడుతూ ఈ కేసును రాజకీయ, వ్యక్తిగత కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, 2 వారాల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పోస్టులు పెట్టిన వారితో పాటు అందుకు ప్రొత్సహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.