‘మహానాయకుడు’ వాయిదా..!

SMTV Desk 2019-01-16 18:50:55  Ntr, Mahanayakudu,

హైదరాబాద్ , జనవరి 16:నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ.. నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు ఈ నెల 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. కాగా రెండోవ భాగం ‘మహానాయకుడు ఫిబ్రవరి 7వ తేదీన విడుదలకావాల్సి ఉంది. కానీ అది వాయిదాపడుతుందని, వారం వెనక్కి వెళుతుందని అంటున్నారు. కారణం ఇంకా కొంత షూట్ మిగిలి ఉందని, దాని తరవాత పోస్ట్ ప్రొడక్షన్ పని కూడ ఉంటుంది కాబట్టి ఈ వాయిదా అని అంటున్నారు. మరి ఈ వాయిదా వార్తలు ఎంతవరకు నిజమనేది చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటన చేస్తేనే తెలుస్తుంది.