రిచా నువ్వు కూడానా

SMTV Desk 2019-01-16 18:30:53  Richa Gangopadhyay, Tollywood, marrige

హైదరాబాద్ , జనవరి 16:ఇప్పటికే మన తెలుగు హీరోయిన్ శ్రియ వొక విదేశీయుడిని పెళ్లాడింది. ఇలియానా, శృతి హాసన్ ఇద్దరూ పరదేశీయులతో రిలేషన్లో ఉన్నారు. రేపో మాపో పెళ్లి చేసేసుకుంటారు. ఇప్పుడు వీరి జాబితాలోకి రిచా గంగోపాధ్యాయ కూడ చేరిపోయింది. 2010లో ‘లీడర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ‘మిర్చి, మిరపకాయ్, నాగవల్లి, భాయ్ సారొచ్చారు లాంటి సినిమాల్లో నటించింది. ‘భాయ్ సినిమా తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. తన స్వస్థలం అమెరికా వెళ్లిపోయారు.

సినిమాలు మానేసి ఎంబిఏ చేయడం కోసం అమెరికా వెళ్లి అక్కడే బిజినెస్ స్కూల్లో జోయ్ అనే సహా విద్యార్థి ప్రేమలో పడింది. తాజాగా వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని రిచా స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. త్వరలోనే పెళ్లి డేట్ చెబుతానని అంది. ఈ విషయం తెలిసిన తెలుగు ప్రేక్షకులు రిచా నువ్వు కూడానా అంటూ తెగ ఫీలైపోతున్నారు.