షర్మిళకు కాంగ్రెస్ మహిళా నేత మద్దతు

SMTV Desk 2019-01-16 17:01:43  vijayashanthi, Congress, Sharmila,

హైదరాబాద్ , జనవరి 16: కాంగ్రెస్‌ మహిళానేత విజయశాంతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళానేత షర్మిళకు మద్దతు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనకు వొక ప్రముఖ సినీహీరోతో అక్రమసంబందం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిళ హైదరాబాద్‌ నగరపోలీస్ కమీషనరుకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దానిపై కాంగ్రెస్‌తో మహిళానేత విజయశాంతి స్పందిస్తూ, “సినీ, రాజకీయ రంగాలలో ఉన్న మహిళలపట్ల సోషల్ మీడియాలో ఇటువంటి దుష్ప్రచారం నానాటికీ పెరిగిపోతోంది. ఇది మహిళల పట్ల చులకనభావం ప్రదర్శించడమే. అంతేకాదు... ఈవిధంగా మహిళల మనోధైర్యాన్ని దెబ్బతీసి వారిని సినీ, రాజకీయాలలో రంగాలలో పైకి ఎడగకుండా అణగద్రొక్కాలని ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాను. అటువంటి వారిపై ఫిర్యాదు చేసిన షర్మిళకు నేను మద్దతు ప్రకటిస్తున్నాను. ఈ సమస్యపై మహిళలందరూ ఆమెకు బాసటగా నిలవాలి,” అని విజయశాంతి అన్నారు.