రెహమాన్ ను పక్కన పెట్టిన శంకర్

SMTV Desk 2019-01-16 16:45:38  AR rehman, Indian 2, shanker,

చెన్నై, జనవరి 16: ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్-2. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా సీక్వల్ గా వస్తుంది. ఈమధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచింది.

ఇక ఇదిలాఉండగా శంకర్ సినిమా అంటే రెహమాన్ మ్యూజిక్ ఉండాల్సిందే. అలాంటిది ఇండియన్-2కి శంకర్ రెహమాన్ ప్లేస్ లో అనిరుద్ రవిచందర్ ను తీసుకున్నాడు. జెంటిల్ మన్ నుండి 2.ఓ వరకు శంకర్ సినిమాల్లో అపరిచితుడు, స్నేహితుడు సినిమాలకు తప్ప మిగతా అన్ని సినిమాలకు రెహమాన్ మ్యూజిక్ అందించాడు. కాని ఈసారి ఆ ఛాన్స్ అనిరుద్ కు దక్కింది. యువ సంగీతకెరటం అనిరుద్ తన మ్యూజిక్ తో కోలీవుడ్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినికాంత్ పేట సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఇండియన్-2 కి అనిరుద్ మ్యూజిక్ ఎలాంటి హైప్ తెస్తుందో చూడాలి.