నాని సరసన నితిన్ గర్ల్ ఫ్రెండ్

SMTV Desk 2019-01-16 15:49:48  Megha Akash, Nani

హైదరాబాద్, జనవరి 16: కోలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ తెలుగులో మరో లక్కీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తంది. లై, ఛల్ మోహన రంగ సినిమాల్లో నటించిన ఈ చిన్నది ఆ సినిమాలతో నిరాశపరచింది. అయినా సరే తెలుగులో అవకాశాలను అందుకుంటుంది ఈ అమ్మడు. ఈసారి నాచురల్ స్టార్ నాని సరసన జోడీ కడుతుంది మేఘా ఆకాశ్. నాని, విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ఫీమేల్ లీడ్ గా మేఘా ఆకాశ్ సెలెక్ట్ అయ్యిందట.

ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ అలరించింది. జెర్సీ సినిమాలో మళయాళ భామ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. జెర్సీ ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేశారు. ఆ సినిమా పూర్తి కాగానే విక్రం కుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విక్రం కుమార్ సినిమాకు పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట