ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం

SMTV Desk 2019-01-15 16:58:09  India, Australia, MS Dhoni, Kohli

అడిలైడ్ , జనవరి 15: ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో టీం ఇండియా లెక్కసరిచేసింది. అడిలైడ్ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5x4, 2x6), మాజీ కెప్టెన్ ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోని (55 నాటౌట్: 54 బంతుల్లో 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ (25 నాటౌట్: 14 బంతుల్లో 2x4)తో కలిసి సింగిల్స్‌ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆఖరి ఓవర్‌లో కళ్లుచెదిరే సిక్స్ బాది భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో సిరీస్ 1-1తో సమమవగా విజేత నిర్ణయాత్మక మూడో వన్డే శుక్రవారం ఉదయం 7.50 గంటల నుంచి జరగనుంది.