నాని జెర్సీ సినిమా కాపీనా???

SMTV Desk 2019-01-15 15:15:01  Nani, jersey, Jersey Copied

హైదరాబాద్ , జనవరి 15: టాలీవుడ్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హిరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే టీజర్ చూసిన తర్వాత జెర్సీ హాలీవుడ్ సినిమా కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి.

30 ఏళ్ల తర్వాత క్రికెటర్ కావాలనుకున్న వొక వ్యక్తి దానికి ఎంత కష్టపడ్డాడు.. అతను ఏం చేశాడు అన్నది సినిమా కథ. అయితే హాలీవుడ్ సినిమా ఇన్విన్సిబుల్ సినిమా కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. కాకపోతే అందులో హీరో ఫుల్ బాల్ ప్లేయర్ కాగా జెర్సీ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. మరి సినిమా రిలీజ్ ముందే కాపీ అంటూ వస్తున్న జెర్సీ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితం తెచ్చుకుంటుందో చూడాలి.