జనసేనకు ఒక్క సీటు కూడా రాదు

SMTV Desk 2019-01-15 14:44:11  Janasena, Pawan Kalyan, ka Paul

విజయవాడ , జనవరి 15: ఇటీవల విజయవాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ఓడిపోకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. జనసేన సింగిల్‌గా పోటీ చేస్తే వొక్క సీటు కూడా రాదని.. పవన్ కల్యాణ్‌ కూడా గెలవలేరని ఆయన జోస్యం చెప్పారు. తమతో కలిసి ఓట్ల చీలిక లేకుండా పవన్‌ చూడాలని కోరారు. పొత్తుల విషయంపై ఆలోచిస్తున్నామని.. కలిసి వస్తామంటే కాదనమని స్పష్టం చేశారు. జనసేనతో కలవలాని అనుకుంటున్నానని.. వామపక్షాల పొత్తులతోపాటు తమతో కూడా కలిస్తే బాగుంటుందని పాల్‌ అభిప్రాయపడ్డారు.