పవర్ ఫుల్ పోలీస్ గా

SMTV Desk 2019-01-15 14:35:40  Maheshbabu,police,sandeep reddy vanga

హైదరాబాద్ , జనవరి 15: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం 25వ సినిమాను వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్నాడు. మహర్షి టైటిల్ తో వస్తున్న మహేష్ ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 1 నేనొక్కడినే తర్వాత మహేష్ సుకుమార్ మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగతో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

అర్జున్ రెడ్డి సినిమాతో సత్తా చాటిన సందీప్ వంగ ప్రస్తుతం ఆ సినిమానే హిందిలో రీమేక్ చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తాడట. షుగర్ ఫ్యాక్టరీ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. మహేష్ పోలీస్ అంటే పోకిరి లాంటి సినిమా మరోటి ఆశిస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మరి అర్జున్ రెడ్డి డైరక్టర్ మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.