భారత్ ఘన విజయం

SMTV Desk 2017-07-30 11:58:48  india srilanka, first, test match, india, won

శ్రీలంక, జూలై 30 : శ్రీలంకతో 3 టెస్ట్ సిరీస్ లో భాగంగా గాలెలో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక పై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 600 పరుగులు చేసింది. భారత్ 600 పరుగులు నిర్దేశిస్తే శ్రీలంక కేవలం 291 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ బ్యాట్ మెన్స్ ధావన్, పుజార లు సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులకు డిక్లేర్ చేసింది. శ్రీలంక 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ చేసారు. శ్రీలంక పై భారత్ 304 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ కు శ్రీలంక ఏ దశలోను పోటి ఇవ్వలేక పోయింది. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్ విజయంతో జయభేరి మోగించింది.