గని పైకప్పు కూలి 21 మంది మృతి

SMTV Desk 2019-01-14 11:49:44  China Coal mine accident, Beijing, Shanghai

బీజింగ్, జనవరి 14: చైనాలోని ఓ బొగ్గు గనిలో పైకప్పు కూలి 21 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. ప్రముఖ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం షాంగ్జీ ప్రాదేశిక ప్రాంతంలోని లిజియాగావ్ బొగ్గుగనిలో భూగర్భ ప్రాంతంలో 87 మంది కూలీలు పనిచేస్తుండగా హఠాత్తుగా పై కప్పు కూలిపోవడంతో 19 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.

మిగితా 66 మందిని ప్రాణాలతో బయతాకు తీశారు సహాయక బృందాలు. కాగా అనంతరం మరో రెండు మృతుదేహాలను గుర్తించారు. ఘటనకు కారణాలపై విచారణ చేస్తున్నారు. ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉన్న చైనా ఇలాంటి ప్రమాదాలకు గురవడం సహజమే అని అక్కడి ప్రజలు అంటున్నారు.