అసలు సంక్రాంతి అంటే...

SMTV Desk 2019-01-14 11:40:19  Happy Sankranthi, Bhogi, meaning of Sankranthi

మార్గశిరము మాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినది మొదలు తులారాశివరకు వొక కాలం... దీనినే దేవతలకు పగలు అంటారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పటి నుంచి మేషం వరకూ రాత్రి అంటారు. అలాగే అటు మేషానికి సూర్యుడు వచ్చినప్పుడు, మరలా తులలోకి చేరినపుడు రాత్రింబవళ్లు సమకాలం అవుతుంటుంది. అసలు సంక్రాంతి అంటే... సంక్రమణం అని అర్థం. అంటే సూర్యుడు వొక రాశి నుంచి మరొక రాశికి రావటమే.

ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ రెండు సంక్రమణాలకే ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించింది మొదలు మకర రాశిలో ప్రవేశించేంత వరకూ దక్షిణాయనమని అంటారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటప్పుడు సంక్రమణ పుణ్యకాలమనబడుతుంది. ఇలా సూర్యుడు దక్షిణాయనంలోకి వెళ్లినప్పుడు, ఆ కాలాన్ని కలికాలం అని కూడా పిలుస్తారు.

ఎందుకంటే దక్షిణాయనంలో మానవులచే చేయబడిన పాపాలను తొలగించటానికి ఉత్తరాయన కాలంలో సంక్రాంతి పురుషుడు వేంచేస్తాడు. ఆ సంక్రాంతి పురుషుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారి పాపాలను సంక్రాంతి పురుషుడు సమూలంగా పోగొడతాడు.

ఉత్తరాయణాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.ప్రళయ స్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుంటే ఆది వరాహ రూపంలో విష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజుననే ఉద్ధరించాడంటారు. వామ నావతారంలో విష్ణువు బలి చక్రవర్తి శిరస్సుపై కాలు పెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఇదే రోజున అని చెప్పుకుంటారు. మహాభారతంలో కురువృద్ధుడు భీష్ముని గురించి తెలియనివారుండరు. ఇతడే దేవవ్రతుడు. గంగాశంతనుల అష్టమ సంతానం. పాండవులంటే మక్కువ మెండే అయినప్పటికీ రాజ్యాధినేత ధృత రాష్ట్రుడికి భీష్ముడు అండదండలుగా వుండి కురు సామ్రాజ్యాన్ని రక్షించే కర్తవ్యాన్ని భుజాన మోశాడు. అందుకే భీష్ముడు కురువృద్ధుడు అయ్యాడు. కురు క్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలకు కాయం కూలి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి వుండి ఆయువులు విడుస్తాడు. పుణ్యగతులు మకర సంక్రమణ వేళ సంక్రమిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని, ఈ నెలలో మర ణించినవారికి శాశ్వత పుణ్యలోక ప్రాప్తి వుంటుందని నమ్ముతారు. ఈ మాసంలో బలి చక్రవర్తి పాతాళలోకం నుంచి వచ్చి ఇంటింటా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రా ముఖ్యాన్ని పరిశీలిస్తాడట. అన్ని పండుగల కన్నా ఇది ప్రాముఖ్యం గల పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు

మన పెద్దలకు పుణ్యలోకాల్ని ప్రసాదించే పండుగ అయినందున కూడా ఇది పెద్దల పండుగ లేదా పెద్ద పండుగ అయింది.

ఈ రోజులలో స్ర్తీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముం గిళ్లలో రంగవల్లులు తీరు స్తారు. వాటి చుట్టూ వైకుం ఠ ద్వారాలు తెరుస్తారు. తెల్లవారుజాముననే జంగపుదేవరలు, బుడ బుక్కల దొరలు, పంబల వాండ్లు, బైనా యుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటా రు. వారి వారి తీరుల లో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సం్ర మణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణు వుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని నమ్మకం. ఈ పండుగకు లక్ష్మీదేవికి సంబంధం వున్నదని వొరిస్సా ప్రజలు నమ్ముతారు. ఆమె పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇళ్ల్లలోకి ప్రవేశించిం దట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణ తో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింత లేకుండా ఈ మార్గశిర, పుష్య మాసాల్లో మరింత మంది బీదల ఇళ్లకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందట.

అందువల్ల నే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు పెడతారు. అమె మెత్తని పాదాలు పె ట్టేందుకు వీలుగా ఆవుపే డ ముద్దలపై పెద్ద పువ్వు లయిన తామర, గుమ్మడి పూలను వుంచు తారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని కొలవటం కూడా ఆచారం. గొబ్బి లక్ష్మీ అంటే భూమాతనే. ఆమెను కొలిస్తే బోలెడు సస్యాలను ప్రసాదిస్తుందని విశ్వసి స్తారు. ఈ పర్వదినం శ్రీకృ ష్ణునికి ముఖ్యమైంది కాబట్టి గోపికలు గొబ్బి పాటలు పాడుతూ ఇంటింటికీ వస్తారు.

మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి వొంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు.

అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లుల తీర్చిదిద్దుకోవాలి.

తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.