సంక్రాంతి బరిలో దూసుకుపోతున్న అల్లులు : ఎఫ్2 ఫస్ట్ డే కలెక్షన్

SMTV Desk 2019-01-13 20:28:38  F2 Movie First day collection, Anil ravipudi, Venkatesh daggupati, Varun konidela

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ హీరులుగా వచ్చిన మూవీ ఎఫ్2 . తొలి షోతో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగాఉండడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

నిన్న ఉదయం కంటే మధ్యాహ్నం షోలు బాగా ఫుల్ అయ్యాయి. ఇక సెకండ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.4.95 కోట్ల షేర్ సాధించింది. ఇది వెంకీ కెరీర్ లో సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్.

బాబు బంగారం సినిమా ఓపెనింగ్స్ ద్వారా రూ.5.56 కోట్లు రాబడితే ఇది రూ.4.95 కోట్లు రాబట్టింది. వరుణ్ తేజ్ ఫిదా తరువాత ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

ఏరియాల వారీగా కలెక్షన్లు..
నైజాం.................................................... 1.73 కోట్లు
సీడెడ్......................................................0.52 కోట్లు
ఉత్తరాంధ్ర.............................................0.55 కోట్లు
గుంటూరు...............................................0.39 కోట్లు
ఈస్ట్........................................................0.63 కోట్లు
వెస్ట్.........................................................0.57 కోట్లు
కృష్ణ........................................................0.40 కోట్లు
నెల్లూరు...................................................0.17 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.4.96 కోట్ల షేర్ ని రాబట్టింది.