రష్మి రాసలీలలు...????

SMTV Desk 2019-01-13 20:09:44  Rashmi gautam, TV Anchor, Rashmi guatam twitter account

హైదరాబాద్, జనవరి 13: ప్రముఖ టీవీ యాంకర్ రష్మి గౌతమ్ సామజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ నెటిజన్ రష్మి గురించి తప్పుగా మాట్లాడుతూ ఓ పోస్ట్ పెట్టాడు. రష్మికి సంబంధించిన ఓ వీడియోను నెట్ లో పెడతానని త్వరలోనే రష్మి రాసలీలలు యూట్యూబ్ లో చూస్తారంటూ పోస్ట్ పెట్టాడు.

ఇది చూసిన రష్మి అతడిపై మండిపడింది. తనపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే వారికి తగిన సమాధానం చెప్పే రష్మి వీడియో లీక్ చేస్తానని చెప్పిన సదరు నెటిజన్ కి ఘాటు రిప్లయ్ ఇచ్చింది. యూట్యూబ్, సోషల్ సైట్స్ అని కాకుండా జీవితంలో పనికొచ్చే పని చేస్తే అప్పుడు పక్కవాళ్ల జీవితాలపై ఇలాంటి బురద చల్లే సమయం ఉండదంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. నచ్చకపోతే తనను అన్ ఫాలో అవ్వమని చెప్పింది. ఇది చూసిన రష్మి అభిమానులు ఇలాంటి కామెంట్స్ పై రియాక్ట్ అవ్వొద్దని రష్మికి సూచిస్తున్నారు.