చెరువులో పడి ఇద్దరు మృతి

SMTV Desk 2017-07-30 10:43:52  nagar karnul, village,two dieds, in pond

నాగర్ కర్నూలు, జూలై 30 : నాగర్ కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు తెల్కపల్లిలోని పెద్ద చెరువులోకి సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోలిపోయారు. ఆ ఇద్దరు యువకులని అదే ప్రాంతానికి చెందిన అంజి, ప్రభాస్ లుగా గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇరు కుటుంబాలు శోక సంద్రం లో మునిగిపోయాయి. అయితే, అంజి (12) మృతదేహం లభ్యం కాగా, ప్రభాస్ (12) కోసం స్థానికులు గజ ఈతగాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.