వ్యభిచార కేంద్రంగా మారిన అన్నా క్యాంటీన్...!!!

SMTV Desk 2019-01-13 19:17:35  TDP, Anna canteen, Prostitutes house, Anantapuram district, Hindoopuram

అనంతపురం, జనవరి 13: తెదేపా ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ లో భూతు భాగోతాలు వెలుగు చూశాయి. అనంతపురం జిల్లాలోని హిందూపురంకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌లో రాత్రి వేళల్లో కొంతమంది వ్యక్తులు వ్యభిచార కేంద్రంగా మార్చారంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై ఆ గ్రామ ప్రజలు నిఘా పెట్టారు.

శనివారం సాయంత్రం వాచ్ మెన్ మరో మహిళతో రాసలీలు జరుపుతుండగా పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా ప్రతినిధులు వాచ్ మెన్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. కేసు నమోదు చేసి విచారించాల్సిన పోలీసులు వారిని వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.