హార్దిక్ పాండ్యాకు మరో దెబ్బ...!!!

SMTV Desk 2019-01-13 16:49:58  Hardik pandya, Gillete guard advertisement,Rahul, BCCI

ముంబై, జనవరి 13: ప్రముఖ టీవీ షో లో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన హార్దిక్ పాండ్య, రాహుల్ పై బిసిసిఐ సస్పెన్షన్‌ వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పాండ్యాకు మరో షాక్ తగిలింది. పాండ్య, రాహుల్ నీ ప్రచారకర్తలుగా నియమించుకున్న పలు ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు వాటి వొప్పందాలను రద్దు చేసుకోవాలని భావిస్తున్నాయి.

ఈ క్రమంలోనే జిల్లెట్‌ సంస్థ హార్ధిక్‌తో కొన్ని నెలల క్రితం వొప్పందం చేసుకుంది. తాజాగా అతడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు దమారం రేపడంతో అతనితో భాగస్వామ్యాన్ని తెంచుకున్నట్లు జిల్లెట్‌ ప్రకటించింది. జిల్లెట్‌ ప్రచారం నుంచి పాండ్యాను తప్పిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.