ఆన్ లైన్ కాకా గాల్లో ఫుడ్ డెలివరీ?

SMTV Desk 2017-07-28 19:01:19  Drones, Online Kaka food delivery, Lucknow

లక్నో, జూలై 28 : హోటళ్ల నుంచి డోర్ డెలివరీ కొరకు ఏదైనా ఫుడ్ ఆర్డర్‌ ఇస్తే చెప్పిన ఎంతో సమయానికి గాని ఆర్డర్ వస్తుంది దీనికి కారణం ట్రాఫిక్ ఇబ్బందులే. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని లక్నోలోని ఆన్‌లైన్‌ కాకా ఫుడ్‌ డెలివరీ కంపెనీ వినూత్న పరిష్కారం కనిపెట్టింది. లక్నోలో ట్రాఫిక్‌ సమస్యలతో ఫుడ్‌ డెలివరీ కష్టం మవ్వడంతో గాల్లో ఫుడ్‌ డెలివరీ చేయాలనే కొత్త ఆలోచనతో ఈ కంపెనీ ముందుకు వచ్చింది. ఇక ఆలోచన తట్టడమే ఆలస్యం వెంటనే కార్యచరణ రూపొందించింది. డ్రోన్‌ కెమెరాలతో వీడియోలు తీసినట్లే డ్రోన్‌లతో ఫుడ్‌ డెలివరీ కూడా సాధ్యమైంది , డెలివరీ టైం లో 1/3 వంతు తగ్గిందని, అదేవిధంగా డోర్ డెలివరీ కి టూ వీలర్ ఉపయోగించకపోవడం వల్ల పొగకాలుష్యం కూడా తగ్గిస్తుందని తెలిపారు. ఈ ఆలోచన విధానాన్ని రూపొందించడానికి ఆన్ లైన్ కాకా ఉద్యోగులు అహద్‌ అర్షద్‌, మొహద్‌ బిలాల్‌లు ఒక సంవత్సరం పాటు కష్టపడితే ఈ పని పూర్తయిందని ఇప్పటికే వీటిని టెస్టు డ్రైవ్‌ నిర్వహించినట్లు . అయితే కేంద్రవిమానాయ శాఖ, లక్నో డీఎంల నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు ఈ కంపెనీ సోషల్‌ మీడియా మేనేజర్‌ వివేక్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు కంపెనీకి అనుమతులు లభిస్తే నార్త్‌ ఇండియాలో నెం.1 డెలవరీ సంస్థగా నిలవనుందన్నారు.