ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో భారీ పేలుడు...

SMTV Desk 2019-01-13 11:34:56  Paris arondissement fire accident, France capital city paris, fire accident

పారిస్, జనవరి 13: శనివారం ఉదయం పారిస్ లోని ఆరోన్‌డిస్‌మెంట్‌ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు కారణంగా అక్కడి భవనాలు ధ్వంసమయ్యాయి.

ఈ ప్ర‌మాదంలో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్న విషయం తెలియాల్సి ఉందని, పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన భవనంలోని ఓ బేకరిలో గ్యాస్‌ లీకై పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.