డ్రగ్స్ కేసుపై సీఎం కేసీఆర్ సమీక్ష

SMTV Desk 2017-07-28 18:57:43  CM KCR MEETING WITH SIT TEAM

హైదరాబాద్, జూలై 28 : డ్రగ్స్ కేసుల విచారణపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో డీజీపీ అనురాగ్ శర్మ, ఎక్సైజ్ శాఖ కమీషనర్ చంద్ర వర్ధన్, ఎక్సైజ్ అండ్ ఎంఫోర్స్మేంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సిటీ కమీషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు విషయంలో విచారించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సిట్ అధికారులు సేకరించిన సాక్ష్యాలేంటి? అవి కేసును ఏవిధంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయో అని అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా అటు సిట్ విచారణ సరిగా జరగలేదంటూ సినీ వర్గాల నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా సర్వే జరిపే సంస్థలతో వీటిని అటాచ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్కూల్స్, సాఫ్ట్ వేర్ సంస్థలలో డ్రగ్స్ వాడినట్లు వార్తలు వినిపిస్తున్న తరుణంలో వారిని ఎందుకు విచారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. "సినీ ప్రముఖులు నేరస్తులు కాదు, వారిని బాధితులుగా మాత్రమే చూడాలి. డ్రగ్స్ అమ్మడం సరఫరా చేయడం నేరం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యం" అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.