పిడుగురాళ్ళలో భూప్రకంపనలు

SMTV Desk 2019-01-12 16:30:15  Guntoor, Earthquake, Piduguraallu

గుంటూరు, జనవరి 12: జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కొద్ది నిమిషాల వ్యవధిలో భూప్రకంపనలు సంభవించాయి. అనంతరం కొన్ని నిమిషాల పాటు భూమి కంపించింది. అర్ద గంట తర్వాత మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురై ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.