ఈ నెల 22న నగరానికి అమిత్ షా

SMTV Desk 2019-01-12 14:17:04  Amith shah, BJP, Hyderabad, Assembly elections, Loksabha elections

హైదరాబాద్, జనవరి 12: ఈ నెల 22న నగరానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయపాలైనందుకు గాను రానున్న లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు సమాలోచనలు చేసేందుకు అమిత్‌ షా నగరానికి విచ్చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీ సీనియర్‌ నేతలు, పార్లమెంటరీ ఇన్‌ఛార్జీలతో ఆయన భేటి కానున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు.