'జెర్సీ' టీజర్ రిలీజ్..

SMTV Desk 2019-01-12 13:19:54  Nani, new movie, jersey teaser

హైదరాబాద్, జనవరి 12: నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా తెరకెక్కుతుంది. నాని క్రికెటర్ గా అర్జున్ పాత్రలో కనిపించే ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్బంగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. క్రికెటర్ గా అగ్ర స్థానానికి చేరుకోవడానికి హీరో పడిన కష్టం .. నిరుత్సాహ పరిచే మాటలను అధిగమించిన తీరు .. తాను అనుకున్న స్థాయికి చేరుకుని పొందిన ఆనందం ఈ టీజర్లో చూపించారు.

ఈ టీజర్ లో వచ్చే ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గానీ .. ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడు అనే డైలాగ్ చాలా బాగుంది. కథ అంతా కూడా క్రికెట్ నేపథ్యంలోనే కొనసాగుతుందనే విషయం ఈ టీజర్ చుస్తే అర్థమవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.