ఆసీస్ దాటికి భారత్ విలవిల...

SMTV Desk 2019-01-12 12:54:22  India, Austalia, Marcus Stoinis, Virat Kohli

సిడ్నీ, జనవరి 12: ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగనున్న మూడు వన్డే సిరీస్ లో భాగంగా, సిడ్నీ వేదికగా జరుగుతున్నా తొలి వన్డే లో ఆసీస్ టాస్ గెలిచి బాటింగ్ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగుల చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో ఉస్మాన్ ఖవాజా (59), షాన్ మార్ష్(54), హ్యాండ్స్‌కోంబ్(73) పరుగులు చేసారు. ఆల్ రౌండర్ స్టోయినిస్ చివరి ఓవర్లలో 43 బంతుల్లో, 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, కుల్దీప్ రెండు వికెట్లు, జడేజా వొక్క వికెట్ తీశారు.

289 టార్గెట్ తో బరిలో దిగిన ఇండియాకు మొదటి 5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లి 3 పరుగులకే వెనుతిరిగారు. శిఖర్, రాయుడు కూడా పెద్దగా పరుగులు చెయ్యకుండానే ఔట్ అయ్యారు. ఇప్పుడు ధోని(12), రోహిత్ శర్మ(24) పరుగులతో గ్రీస్ లో ఉన్నారు.