కొనసాగుతున్న రవితేజ విచారణ

SMTV Desk 2017-07-28 18:06:23  raviteja drugs case, sit, oficetions, enqary,

హైదరాబాద్, జూలై 28 : డ్రగ్స్ కేసులో ఈ రోజు రవితేజ ను నాంపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. రవితేజ డ్రగ్స్ వాడుతున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఈ విచారణ జరుపుతున్నారు. ఇందులో రవితేజను కెల్విన్ తో ఉన్న పరిచయం పై, పూరి తో కలిసి డ్రగ్స్ వాడుతున్నారా, ఇలాంటి ప్రశ్నలతో రవితేజను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో చాలా కీలక విషయాలను రవితేజ దగ్గరి నుంచి రాబడుతున్నట్లు సమాచారం. సిట్ కార్యాలయంలో రవితేజ విచారణ జరుగుతుండటంతో ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చారు.