రొనాల్డోకు పోలీస్ వారెంట్

SMTV Desk 2019-01-12 12:01:49  Cristiano Ronaldo, kyatharin Morga, Allegation, Portugal

జనుఅరీ 12: పోర్చుగల్ ప్రఖ్యాత సాకర్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో లైంగిక వేదింపులు చేసాడని, అమెరికాకు చెందిన మాజీ మోడల్ క్యాథరిన్ మోర్గా(33) గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని రోనాల్డో న్యాయవాదులు ఈ ఆరోపణలు మొదటినుండి ఖండిస్తున్నారు. జూన్ 13, 2009, హోటల్ సూట్ లో తనపై అత్యాచారం చేసాడని చెప్పగా, దీనిపై పోలీసులు విచారణ జరిపి, హోటల్లో క్యాథరిన్‌ దుస్తులను ప్రధాన ఆధారంగా సేకరించారు. ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు లాస్ వేగాస్ పోలీసులు డీఎన్‌ఏ నమూనాలు కోరుతూ ఇటలీలో లీగ్ ఆడుతున్న రొనాల్డోకు నోటీసులు పంపారు. మరోవైపు క్యాథరిన్ కు 3. 75 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు వొప్పదం కుదిరింది. మీ టూ ఉద్యమ ప్రభావంతో ఆమె మళ్లీ ముందుకు వచ్చి నోరు విప్పింది.