ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోపిడికీ పరిమితమయ్యారు...??

SMTV Desk 2019-01-12 11:56:39  AP Assembly elections, Janasena party, Pawan kalyan

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి పార్టీలు పక్క పార్టీలతో పొత్తుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేనకు సీట్లు రావంటూనే మనతో పొత్తు కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.

జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జనసేనాని ఇవాళ కృష్ణాజిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన బలంగా ఉందని, అందుకే మనతో పొత్తు కోసం వేరే వారితో ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ వెల్లడించారు. 2014లో వ్యూహాత్మకంగానే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చామని కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోపిడికీ పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.