జనసేనతో పొత్తుకు సిద్దం...???

SMTV Desk 2019-01-12 11:51:01  KA Paul, Janasena, Pawan kalyan, Prajashanthi party, Chandrababu, YS Jagan mohan reddy

నెల్లూర్, జనవరి 12: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎ పాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ జనసేనతో పొత్తుపై స్పందించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలుస్తార అని అడిగితే అటువంటి సంకేతాలు వస్తే ఆలోచిస్తామని జవాబిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా తాము పనిచేస్తామని చెప్పారు. దేశంలో 18 రాష్ట్రాల్లో పలు పార్టీలను తామే గెలిపించామని ఢంకా బజాయించుకున్నారు. తెలంగాణలో పోటీకి తమకు సమయం సరిపోలేదని పాల్ అన్నారు.

గత ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు విజయం వెనక తమ పార్టీ ప్రభావం ఉందని చెప్పుకున్నారు. తమ పార్టీ నిర్మాణంలో హిప్నో కమలాకర్ చురుగ్గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో పది మందిని చేర్పించినవారికి టికెట్ ఇస్తామని చెప్పారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. మొత్తం పాల్ సందడి ఎపి రాజకీయాల్లో వినోదాన్ని పంచుతున్నాయి.