ఎస్‌ఐ ఫలితాల విడుదలకై నిరసన

SMTV Desk 2017-07-28 17:53:20  SI RESULTS ISSUE IN OU CAMPUS

హైదరాబాద్, జూలై 28 : 9 నెలల క్రితం నిర్వహించిన ఎస్‌ఐ పరీక్ష ఫలితాలను ఇంకా విడుదల చేయకపోవడంతో, నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఎస్‌ఐ ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఆందోళన చేపట్టారు. ఫలితాల విడుదలలో ప్రభుత్వం వైఖరిని తప్పుబడుతూ గుంజీలతో నిరసన తెలిపారు.