‘పేట’ హిట్ పై స్పందించిన రజనీ..

SMTV Desk 2019-01-11 19:40:06  Rajinikanth, Petta

చెన్నై, జనవరి 11: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట చిత్రం నిన్న విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో రజనీ అభిమానులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ స్పందించారు. ఈ సినిమాని ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ చిత్రంలో తాను బాగా నటించానని ప్రశంసలు వస్తున్నాయి. ఇందులో తనదేమీ లేదని, ఈ ప్రశంసలన్నీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు దక్కుతాయని, ఈ చిత్ర విజయానికి ఆయనే కారణం అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా ప్రజలకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విహారయాత్ర నిమిత్తం గత ఏడాది డిసెంబరు 22న ఆయన అమెరికా వెళ్లారు. తిరిగి నిన్న చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో తనను పలకరించిన విలేకరులతో రజనీ పైవిధంగా స్పందించారు.