టీడీపీని వీడే ప్రసక్తే లేదు...

SMTV Desk 2019-01-11 19:39:45  TDP, Janasena, Bhooma akhila priya reddy, YSRCP

కర్నూల్, జనవరి 11: ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియ తాను పార్టీ మారుతుందా లేక టీడీపీ లోనే కొనసాగుతుందా అని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. కొన్ని రోజులుగా నేను తెలుగుదేశం పార్టీ ని వీడుతున్నట్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు..ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. టీడీపీని వీడే ప్రసక్తే లేదు. కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వీటిని నమ్మొద్దు.

చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లొచ్చాయి. నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులను సీఎం చంద్రబాబు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తా. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా ఉంచాను. గన్‌మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాను అని తెలిపింది. అఖిల క్లారిటీ తో అందరిలో ఉన్న అనుమానాలకు తెరపడినట్లు అయ్యింది.