నా ఫస్టు లవ్ అప్పుడే: తాప్సీ

SMTV Desk 2019-01-11 19:12:40  Taapsee Pannu, love story

హైదరాబాద్, జనవరి 11: తాప్సీ తెలుగు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గుతుండగానే బాలీవుడ్ అవకాశాలపై దృష్టి పెట్టిన తాప్సీ, బి టౌన్ లో బాగానే నిలదొక్కుకుంది. హిందీ చిత్రాల్లో ఆమె చేసిన కొన్ని పాత్రలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, వొక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించింది. "స్కూల్ డేస్ లోనే నేను లవ్ లో పడ్డాను. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా క్లాస్ అబ్బాయితో ప్రేమలో పడ్డాను. నా ఫ్రెండ్స్ తో పోలిస్తే నా ఫస్ట్ లవ్ రిలేషన్ ఆలస్యమైందని నేను భావించేదానినని అన్నారు.

10వ తరగతిలోకి వచ్చాక .. బోర్డు ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాలంటూ నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. అలా నా లవ్ రిలేషన్ దెబ్బతినడం తట్టుకోలేకపోయాను. అప్పట్లో సెల్ ఫోన్స్ లేకపోవడం వలన, కాయిన్ బాక్స్ నుంచి ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఏడ్చాను కూడా. ఇప్పుడు అదంతా తలచుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.