ఆస్ట్రేలియాలో అతిపొడవైన ఎలక్ట్రిక్ మార్గం

SMTV Desk 2017-07-28 17:50:22  Largest electric way in the world, Electric way, Australia Electric highway

సిడ్నీ, జూలై 28: ఇటు కాలుష్య రహిత, అంతరించి పోని ఇంధన వాడకం వలన అందరి దృష్టిని ఎలక్ట్రికల్‌ వాహనాలు ఆకర్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్‌ వాహనాల హవా నడవబోతుందని అన్ని కంపెనీలు, దేశాలు వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ప్రపంచంలోకెల్లా అతి పొడవైన హైవేను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ హైవే 18 నగరాలను కలుపుతూ 2000 కి.మీ పొడవున బ్రిస్బేన్‌ నుంచి టుల్లీ వరకూ భారీ ఖర్చుతో చేపడుతున్నారు. ఈ హైవేలో వాహనాలు తక్కువ సమయంలోనే త్వరగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటున్న స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ నిర్వహించిన ఒక సర్వేలో ఎక్కువ శాతం ప్రజలు ఎలక్ట్రికల్‌ వాహనాల కొనుగోలు చేయాలనుకున్నట్లు తేలింది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్నా, వాటిలో కొన్ని చోట్ల మాత్రమే త్వరగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు కలిగి ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త హైవే మార్గం వలన ఈ సమస్య తీరనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.