లోకోపకార గుణానికి వందనం....ట్వీట్ వైరల్

SMTV Desk 2019-01-11 19:08:31  KTR, TRS Working president, Twitter, Old age home

హైదరాబాద్, జనవరి 11: టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నగరంలోని చౌటుప్పల్ కి చెందిన ఓ దంపతులు కొంత కాలం క్రితం తమ సొంత డబ్బులతో(రూ.1 కోటి) వృద్దాశ్రమాన్ని నిర్మించి దాన్ని ఇప్పటికీ నడిపిస్తున్నారని, ఇప్పుడు నిర్వహణ నిమిత్తం దాన్ని ప్రభుత్వానికి అందించారని తెలిపారు. ఈ ట్వీట్ ద్వారా వారి గొప్పతనాన్ని వివరిస్తూ, అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. వారి లోకోపకార గుణానికి వందనం అంటూ ట్వీట్ చేశారు. వారితో దిగిన ఫోటోని కేటీఆర్ ట్వీట్ చేశారు.