డ్రగ్స్ కేసుపై మంత్రి తలసాని స్పందన

SMTV Desk 2017-07-28 17:33:38  drugs case, minister, talasani srinivas yadav

హైదరాబాద్, జూలై 28: హైదరాబాద్ లో కొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన డ్రగ్స్ మాఫియాలో సిట్ అధికారులు కొంత మంది సినీ ప్రముఖులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదని, సినిమా ఇండస్ట్రీ కొద్ది మందికే పరిమితం కాదని ఆయన అన్నారు. సినిమా వాళ్ళు ఆందోళన చెందుతున్నట్లుగా నా దృష్టికి రాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదని తెలిపారు. ప్రభుత్వం అందరికి మేలు మాత్రమే చేస్తుందని తలసాని తెలియజేశారు.