పాండ్య, రాహుల్ వ్యాఖ్యలపై కోహ్లి కామెంట్స్ ...

SMTV Desk 2019-01-11 17:29:21  Virat Kohli, Responds, Hardik Pandya, KL Rahul, Contraversy

సిడ్నీ, జనవరి 11: పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ లో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పాండ్య, రాహుల్ లను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తప్పుబట్టాడు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం అని కోహ్లి సిడ్నీలో విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. తాజా పరిణామాలు డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపబోవు. ఎన్ని వివాదాలు జరిగినా మా క్రీడా స్ఫూర్తి మారదు. పాండ్యా, రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం" అని విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ వివాదం జట్టుపై, తమ ఆటతీరుపై ఎటువంటి ప్రభావం చూపబోదని విశ్వాసం వ్యక్తం చేశాడు.

భరత్ ఇప్పుడు మూడు వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ శనివారం సిడ్నీ లో ఆడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు టెస్ట్ సిరీస్ లో 2-1తో గెలిచి చరిత్ర సృష్టించింది. అంతకముందు జరిగిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.