విదేశాల్లో రాణించలేకపోతున్న అశ్విన్‌?

SMTV Desk 2019-01-11 16:53:16  Harbajan Singh, Ashwin, Comments, Australia Series

జనవరి 11: భారత ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫిట్‌నెస్‌ తీరును మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తప్పు పట్టాడు. అశ్విన్‌ కేవలం సొంతగడ్డపై ప్రదర్శిస్తున్నాడని, విదేశాల్లో గాయాలకు గురవుతున్నాడంటే ఆందోళన పడాల్సిన విషయం అని అతను పేర్కొన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ లో జరిగిన టెస్టులో మొదటి మ్యాచ్ మాత్రమే ఆడగా, తర్వాత గాయాలపాలయ్యాడు. అడిలైడ్ లో జరిగిన సిరీస్ లో కూడా తొలి టెస్ట్ లో రాణించగా, అదికూడా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అశ్విన్‌కు మరో 3 వికెట్లు తీసేందుకు ఏకంగా 52 ఓవర్లు అవసరమయ్యాయంటే విదేశాల్లో అతని పేలవ రికార్డు ఏమిటో తెలుస్తుంది అని భజ్జీ మండి పోయాడు. అశ్విన్‌ కి బదులుగా జడేజా, కుల్దీప్‌లనే ప్రధాన స్పిన్నర్లుగా ఆడించాలని సూచించారు.