బామ్మ పాత్రకి నో చెప్పిన ఆ హీరోయిన్ ?? ..

SMTV Desk 2019-01-11 15:53:34  Samantha, new movie, o baby, old women getup

హైదరాబాద్, జనవరి 11: సమంత ఈమధ్య నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎక్కువగా చేస్తుంది. నటన పరంగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టే భిన్నమైన పాత్రలను చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలాగే ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో వొక సినిమా చేయడానికి అంగీకరించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి ఇది రీమేక్. ఈ చిత్రానికి ఓ బేబీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో సమంత 70 యేళ్ల బామ్మగాను కనిపించనుందనే టాక్ వచ్చింది.

ముందు ఈ చిత్రంలో బామ్మ పాత్ర చేయడానికి సమంత అంగీకరించింది. కానీ ఆ తరువాత స్నేహితుల సలహా మేరకు వెనక్కి తగ్గిందనేది తాజా సమాచారం. వృద్ధురాలి పాత్రలో కనిపిస్తే కెరియర్ పై దాని ప్రభావం పడుతుందని భావించి ఆమె నో చెప్పేసిందట. దీంతో వృద్ధురాలి పాత్రకి సీనియర్ హీరోయిన్ లక్ష్మిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అంటే ఆ పాత్రలో యువతిగా వున్నప్పుడు సమంత, ముసలితనం వచ్చినప్పుడు లక్ష్మి తెరపై కనిపిస్తారన్న మాట.