మళ్ళీ తెరాసేనా..???

SMTV Desk 2019-01-11 15:13:47  TRS Party, Panchayat elections, Assembly elections, Nominations

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ పంచాయతి ఎన్నికల్లో మళ్ళీ తెరాసే విజయభేరిని మ్రోగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం పంచాయతి ఎన్నికల తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా 4480 సర్పంచ్‌ స్థానాలకు, 39832 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వొంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. వీటిలో 334 సర్పంచ్‌ స్థానాలకు సింగిల్‌ నామినేషన్‌ దాఖలైంది.

ఇందులో 291 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ బలపరచిన అభ్యర్ధులే ఉండడం విశేషం. తొలి విడత ఎన్నికలకు గాను 27,940 మంది సర్పంచ్‌ స్థానాలకు, 97690 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారని గురువారం ఎన్నికల అధికారి ప్రకటించారు. నేడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఏకగ్రీవ సర్పంచ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండో విడత ఎన్నికల సమరం శుక్రవారం నుంచి ప్రారంభమయింది. ఈ నెల 13వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.రెండో విడత ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి.