రాహుల్‌కు నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్‌..

SMTV Desk 2019-01-11 13:12:17  Rahul Gandhi, Nirmala Sitharaman, comments, National Commission for Women, Issued notices

న్యూఢిల్లీ, జనవరి 11: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై దురుసు వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఎన్‌సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్‌) గురువారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ జైపూర్‌లో ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించే భాగంలో నిర్మలా సీతారామన్‌పై కొన్ని అనైతిక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ కి ఎన్‌సీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది.


జైపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ‘పార్లమెంట్‌లో రఫేల్‌ వొప్పందం గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ (నిర్మలా సీతారామన్‌)ను కోరారని, ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనిపై వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను ఆధారంగా తీసుకొని మహిళా కమిషన్‌ రాహుల్‌కు నోటీసులు ఇచ్చింది.