లైంగిక వేధింపులకు గురైన‌ బాలీవుడ్‌ హీరో

SMTV Desk 2017-07-28 17:02:58  Akshay Kumar, Sexual harassment, mumbai, Sonam Kapoor, Kalki Kochlin

హైదరాబాద్, జూలై 28: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైన‌ట్టు తెలిపారు. మ‌హిళ‌ల‌పైనే కాదు చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతాయని, వాటి గురించి వాళ్లు చెప్పుకోలేకపోయిన తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని చెప్పారు అక్షయ్ కుమార్. లైంగిక వేధింపులు మహిళలకే కాదు పురుషులకు కూడా ఉంటాయనే విషయం కొన్ని సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. మానవ అక్రమ‌ రవాణాపై ముంబైలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అయన మాట్లాడుతూ... తాను చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తన చిన్న వయసులో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని, తను ధైర్యంగా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పానని త‌ల్లిదండ్రుల దగ్గర నాకు స్వేచ్ఛ ఉండటం వల్ల ఈ విషయాన్ని నేను వాళ్ళతో పంచుకున్నానని చెప్పారు. రెండేళ్ల క్రితం తన కుమారుడితో కూడా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ప‌ని లోంచి తీసేశామ‌ని చెప్పారు. తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బాలీవుడ్ న‌టీమ‌ణులు సోన‌మ్ క‌పూర్‌, క‌ల్కి కొచ్లిన్‌లు బ‌హిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పెద్దవాళ్లకు చెప్పాలని, అప్పుడే ఇలాంటి పనులకు పాల్పడేవారికి బుద్ధిచెప్పగలం అంటూ చెప్పారు అక్షయ్.