ఫేస్ బుక్ అదనపు ఫీచర్లతో మరింత ఆకర్షణ

SMTV Desk 2017-05-27 17:42:29  facebook,newfeatures,like,dislike,love

హైదరాబాద్, మే 25: దేశవిదేశాల మధ్య ఎల్లలను చేరిపేసి... అందర్ని కలిపే ఆత్మీయ వేదికగా కొనసాగుతున్న ఫేస్ బుక్ రూపం మారబోతోంది. ఫేస్ బుక్ అదనపు ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. లైక్, లవ్, డిస్ లైక్, హ్యపి, అన్ హ్యాపి తదితర అప్షన్ లు, చాట్ అప్షన్ తదితరాలతో ఫేస్ బుక్ కొనసాగుతున్నది. అదనంగా లైవ్ చాట్, చాట్ విత్ అనే రెండు కొత్త ఆప్షన్ లతో మరింత ఆకర్శనీయంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం 4జి నెట్వర్క్ కు అనుసంధానంగా కొనసాగడంతో పాటు 5జీ కి కూడా అనుకూలంగా కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి. లైవ్ చాట్ ద్వారా చాట్ కొనసాగితున్న వారి మధ్యలో అవసరమైన వారు చాట్ చేస్తూ జాయిన్ కావచ్చు. అదే విధంగా చాట్ విత్ ద్వారా వీడియో కాలింగ్ లాంటి ఫీచర్ మరింత అధునాతనమైన తరహాలో కొనసాగనుంది. సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సాప్ ల హంగామా, భాగస్వామ్యం లు ఎప్పటికప్పుడు పెంచేందుకు ఆయా సంస్థలు కొత్తగా కల్పిస్తున్న సదుపాయాలు వాటిని వదిలి ఉండలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. దూరంగా ఉన్నా దగ్గరే ఉన్నట్లుగా అనుభూతి పొందే పరిస్థితులు ఆయా సంస్థలు కల్పిస్తున్నాయి.