కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత...

SMTV Desk 2019-01-10 19:42:20  Congress former MLA, M Narayanareddy, Rayachoti constituency, MLA Died

కడప, జనవరి 10: రాయచోటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన ఆనోరోగ్యంతో భాదపడుతూ ఇవ్వాల తుది శ్వాస విడిచారు. ఈయన 1994లో జరిగిన ఉప ఎన్నికల్లో అలాగే ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా నారాయణరెడ్డికి పేరుంది. నారాయణరెడ్డికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారు. నారాయణరెడ్డి మృతితో పలు పార్టీల నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.