ఆగస్టు 28 నుండి ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం

SMTV Desk 2017-07-28 16:53:18  ipl, cricket, sony,

ముంబై, జూలై 28: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతి సంవత్సరం ప్రేక్షకులను ఆనందపరుస్తూ వస్తుంది. ఐపీఎల్ ప్రసారాలను సోనీ చానల్ 9 సంవత్సరాలుగా ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ లీగ్ ప్రసార హక్కులను ఈ-వేలం ద్వారా అందజేయాలని బీసీసీఐ కి భారత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ దీనిపై నిర్ణయాన్ని త్వరగా తెలియజేయాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఈ హక్కులను ఈ-వేలం ద్వారా అందజేయడం సరైన విధానమని బీజీపీ నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. దాదాపు 30 వేల కోట్ల విలువ చేసే ఐపీఎల్ మీడియా హక్కులను సాధారణ పద్దతిలో విలువ కట్టడం సరైనది కాదని ఆయన పిల్ లో పేర్కొన్నారు. 2008 లో పదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కులను 918 మిలియన్ డాలర్లకు సింగపూర్ కు చెందిన వరల్డ్ స్పోర్స్ చేజిక్కించుకుంది. తరువాత సంవత్సరానికే కాంట్రాక్ట్ రద్దు అవడంతో తొమ్మిది సంవత్సరాలకు గాను 1.63 మిలియన్ డాలర్లు చెల్లించి ఐపీఎల్ మీడియా హక్కులను సోనీ గ్రూప్ దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కులను జారీ చేయబోయే వేలం ఆగస్టు 28 న ప్రారంభం కానుంది.