ఆప్ లోకి ప్రకాష్ రాజ్ ??..

SMTV Desk 2019-01-10 18:19:21  prakash raj, kejriwal, AAP,Delhi,Banglore,Vilakshananatudu,lokshba

న్యూఢిల్లీ, జనవరి 10: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈమధ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ఈ ప్రకటన చేసిన తరువాత, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. తమ మద్దతు ప్రకటిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దాంతో ప్రకాష్ రాజ్ అప్ లో చేరతారని ఊహాగానాలు వచ్చాయి.

ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఈరోజు ప్రకాష్ రాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ని కలిశారు. తన రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు. పలు అంశాలకు సంబంధించిన సమస్యలపై చర్చించామని, వాటి పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరినట్టు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.